“చదవండి-ఆలోచించండి-పాటించండి” (Importance of Time – an inspirational story)

(పంపండి నాకు 500/-)

‘పాంచ్  సౌ  కీ  సీక్’
కళింగపట్నం  ఓడరేవులో అనంతశర్మ, కుమారవర్మ అనే వ్యాపారస్తులు ఎగుమతి, దిగుమతుల వ్యాపారం చేసేవారు.
Telugu inspirational stories for students
ఒకనాడు  అనంతశర్మ- కుమారవర్మ దగ్గరికి వచ్చి, ఊరిలో ఒక సాధువు మానవులకు చాలా ఉపయోగపడే సందేశాలిస్తున్నాడంటా! ఒక్కొక్క సందేశం వెల 500/- రూపాయలట! మనం కూడా వెళదామని అనంతశర్మ అన్నాడు.

                 కానీ, కుమారవర్మ- మనం ఇంత పెద్ద వ్యాపారస్తులం,పది మందిని బ్రతికిస్తున్నాం.
మనకి సందేశాలు అవసరమంటావా! అని తన అయిష్టతను ప్రకటించాడు. దానికి అనంతశర్మ లేదు,లేదు, చాలా పేదవారు కూడా ఆ సాధువు దగ్గరికి వెళ్లి 500/-రూపాయలు ఇచ్చి సందేశం పొందుతున్నారు. కాబట్టి ఒక్కసారి మనం కూడా  వెళదామని బలవంతంగా కుమారవర్మతో సాధువు దగ్గరకు వెళ్లారు. ఆ సాధువు రూ:500/- తీసుకొని, ఆ ఇద్దరికి ” ఏ రోజు పని ఆ రోజే ముగించమని, పని పూర్తికాకుండా నిద్ర పోవద్దు” అని సలహా ఇచ్చారు .  ఈ సలహా వినిన కుమారవర్మ, దీనికోసమా? మనం ఇంత సమయం వృధా చేసికొని, రూ 500/-ఖర్చుపెట్టినది.ఈ మాటలు మన తల్లిదండ్రులు మన చిన్ననాటి నుంచి చెప్తున్నారు కదా! అని, అనంతవర్మ మీద విరుచుకుపడ్డాడు.

         కొన్ని నెలల తరువాత,ఒకనాడు ఇద్దరు వ్యాపారస్తులు చాలా  పత్తిని విదేశాలకు పంపడానికి ఓడలలోకి ఎక్కిస్తున్నారు. సూర్యాస్తమయం అయినదని, పనివారందరు పని ఆపేశారు. మిగిలిన పత్తి రేపు ఓడలలోకి ఎక్కిస్తామని చెప్పారు. దీనికి అనంతశర్మ సరేనన్నారు. కాని కుమారవర్మకు రూ: 500/- ఖర్చు పెట్టి వినిన సందేశం గుర్తొచ్చి, అది పాటించాలి అనుకొని లేదు, లేదు, ఇప్పుడే పత్తి అంతా ఓడలోకి ఎక్కించమని, అంతగా అయితే అధిక కూలీ చెల్లిస్తానన్నాడు. అనంతశర్మ అందుకు  అంగీకరించకుండా తన కూలీలను పంపివేసి, నిబంధనల ప్రకారం పనివాళ్లని రేపు సూర్యోదయం తరువాత వచ్చి పనిచేయమని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ కుమారవర్మ మొత్తం పత్తిని ఓడలోకి ఎక్కించి కూలీలకు అధిక పైకం చెల్లించి, అర్ధరాత్రి దాటిన తరువాత వెళ్ళిపోయాడు.
విధివశాత్తు తెల్లవారుజామునుండి గాలులతో కూడిన భయంకరమైన పెద్ద వర్షం కురిసినది. అనంతశర్మ పత్తి మొత్తం నీటిపాలై వ్యాపారంలో నష్టపోయాడు. కొనుక్కున్న సందేశం పాటించి తీరాలి అని పట్టుదలతో పని పూర్తిచేసుకున్న కుమారవర్మ లాభంపొందాడు.

best telugu inspirational stories for motivation

ప్రియమైన మిత్రులారా!!!!!
మనం మన జీవితంలో ప్రతీ నిమిషం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు, మిత్రుల ద్వారా ఎన్నో మంచి మాటలను, విషయాలను వింటూఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. కానీ, ఏనాడు పాటించడానికి ప్రయత్నించం.
వినిన మాటలను పెడచెవిన పెట్టకుండ పాటించినపుడే ఫలితం దొరుకుతుంది.
కాలం మారవచ్చు, మనం మారవచ్చు, మనం సాంకేతికతను ఎంతో అభివృద్ధిని సాధించవచ్చు. మానవుడు ఖగోళ భూగోళం మీద పట్టు సాధించ గలిగాడు కానీ, “గడిచిన సమయం , పోయిన ప్రాణాన్ని” తీసుకురాలేకపోతున్నాడు. కావున, మన ఈ చిన్న జీవితానికి ఎంతో విలువ ఇచ్చి విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ప్రతిక్షణాన్ని సాఫల్యవంతంగా చేసుకుందాం!!
మహాత్మా గాంధీ  గారు అన్నారు…..

                      “ समय् का सदुपयोग करो,श्रम् येव जयते !”

ఇది మీకు నచినట్లు అయితె మీ ప్రెండ్స్ తో షేర్ చేయండి !!   ఇట్లు మీ మహిత ఉప్పలపాటి

3 thoughts on ““చదవండి-ఆలోచించండి-పాటించండి” (Importance of Time – an inspirational story)”

  1. It is very use full story to present generation becouse of present youth never thinking about there life . So keep follow our well wihers words in our life it give life to us.
    Positive thinking always healthy stuff to us and keep smile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *